Kavitha: జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్

Kalvakuntla Kavitha: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్వే ట్రాక్ పై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత కూర్చొని నిరసన చేపట్టారు. 42 % రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ట్రాక్ పై కూర్చొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్లా కార్డులు పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డికి, బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రైల్వే ట్రాక్ వద్దకు భారీగా పోలీసులు చేరుకొని కవితాను సముదాయించే ప్రయత్నం చేశారు.
అయినా వినకపోవడంతో కవితతో పాటు జాగృతి నాయకులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో కవిత చేతికి గాయాలు అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కవితను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ… 42% రిజర్వేషన్ అమలు అయ్యేవరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేస్తే 42 శాతం బీసీ బిల్లు అమలవుతుందని పేర్కొన్నారు.



