ఆంధ్ర ప్రదేశ్
ఐదో పెళ్లిని సిద్ధమైన నిత్య పెళ్లికొడుకు

యానాం పరిధిలోని సావిత్రి నగర్‌కు చెందిన రమేష్ తనను ప్రేమించి పెళ్లిచేసుకుని మోసం చేసాడంటూ గిరియాంపేటకు చెందిన సాయి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకంటే ముందు మరొకరిని పెళ్లిచేసుకుని వదిలి వేసాడని, తనకు తెలియకుండా మరో ఇద్దరిని వివాహం చేసుకుని వారినికూడా మోసం చేశారని తెలిపింది. తాజాగా ఐదో పెళ్లికి సిద్దం అవుతున్నాడని సాయి ఆరోపించారు. పోలీసులు తన ఫిర్యాదును తీసుకోవడంలేదంటూ సాయి ఆవేదన వ్యక్తం చేశారు.



