బాబా వంగా అంచనా.. జూలై 5న ఏం జరగబోతుంది..?

Japan: మనుషులకు జరిగే మంచి చెడులను అంచనా వేసేందుకు కొంతమంది జోతిష్యశాస్త్రాన్ని నమ్ముతారు. మరికొందరు న్యూమరాలజీని నమ్ముతారు. అదే విధంగా ప్రపంచంలో జరిగే జరుగుతున్న జరగనున్న సంఘటనలు అంచనా వేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, బాబా వంగా, నోస్ట్రాడమస్ వంటి వారు ప్రపంచంలో జరిగే సంఘటనలు, మానవుల ప్రవర్తనను ముందే అంచనావేశారు.
తాజాగా జరుగుతున్న సంఘటలు నిజమే అని వందల ఏళ్ల క్రితమే బాబా వంగా చెప్పారు. ముఖ్యంగా 2025 జూలై నెల గురించి బాబా వంగా వేసిన అంచనా ఇదే అంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ బాబా వంగా ఏం చెప్పారు..? జూలై 5న ఏం జరగబోతుంది..?
భవిష్యత్తులో జరగబోయే ఘటనల గురించి రాబోయే వినాశనం గురించి ప్రపంచంలో కొందరు చేసిన భవిష్య వాణి నిజమైంది. అలాంటివారిలో భారతదేశానికి చెందిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఫ్రాన్స్ కు చెందిన నోస్ట్రడమస్ అనే జోస్యకారుడు, బల్గేరియాకు చెందిన బాంబా వంగా అనే వృద్ధరాలు చాలా ఫేమస్. వీరు చెప్పినవన్నీ దాదాపు జరిగాయి. ప్రపంచంలో విధ్యంసాలు, ప్రకృతి వైపరీత్యాల గురించి వీరు చాలా సంవత్సరాల ముందే హెచ్చరిస్తూ చెప్పినవి క్రమంగా జరుగుతున్నాయి.
జపాన్ లో కూడా రియో తాత్‌సూకీ అనే మహిళ ఆమె బతికి ఉన్నప్పుడు చెప్పినవి ఇప్పుడు జరుగుతున్నాయి. తాజాగా ఆమె 2025లో ఒక భారీ సునామీ రాబోతోందని హెచ్చరించారు. గతంలో ఆమె చెప్పినట్లు 2020లో వైరస్ వస్తుందని చెప్పింది జరిగింది. అయితే.. ఆ తరువాత ఆ వైరస్ తీవ్ర రూపంలో మళ్లీ తిరిగి వస్తుందని కూడా ఆమె చెప్పారు.
అక్టోబర్ 3, 1911లో మెసడోనియాలో జన్మించింది. ఈమె జపనీస్ మాంగా కళాకారిణి , స్వీయ-వర్ణనాత్మక దివ్యదృష్టి కలిగిన రియో టాట్సుకి. ప్రపంచ వ్యాప్తంగా బాబా వంగగా ప్రసిద్దిగాంచిన ఈమె అసలు పేరు వంగేలియా పండేవా సర్చేవా. ఈమె కొన్ని అనుకోని కారణాలతో చూపు కోల్పోయిన బాబా వంగాకు అప్పటి నుంచి భవిష్యత్ కనిపిచడం మొదలు పెట్టిందని నమ్మకం. దృష్టి లోపం ఉన్న బాబా వంగా భవిష్యత్తును అద్భుతంగా చెప్పేది.
ఇప్పుడు ఆమె చెప్పినవి చెప్పినట్లు జరుగుతున్నాయి. బాబా వంగ 2025 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న పలు విషయాలను ముందే అంచనా వేసి చెప్పారు. అందులో జపాన్ లో భారీ సునామీ ఒకటి. ఈ సుమనీ ప్రభావం జపాన్ పై మాత్రమే కాదని మొత్తం ఆసియా దేశాలపై ఉంటుందని ఆమె చెప్పారు. అది నిజం అయింది. దీంతో ఇప్పుడు బాబా వంగా జూలై నెలలో జరగనున్ సంఘటనల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు.
బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ మాదిరి గానే జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి కూడా భవిష్యత్ లో జరగనున్న సంఘటనలు అంచనా వేస్తుందని నమ్మకం. అయితే రియో 2025 జులై నెల గురించి చెప్పిన ఓ వార్తతో ఇప్పుడు జపాన్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. జూలై 5, 2025 తేదీ సమీపిస్తున్న కొద్దీ రియో టాట్సుకి రాసిన 1999 మాంగా ది ఫ్యూచర్ ఐ సా అంటే నేను చూసిన భవిష్యత్తులోని అంచనాపై జపాన్ తీవ్ర ఆందోళన చెందుతోందని అర్థం.
ఈ నెల 5న జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున చీలిక సంభవించి పేలుడు, అగ్నిపర్వత విస్ఫోటనం జరిగి జపాన్‌లో ఓ భారీ సునామీ సంభవిస్తుందని దీంతో జపాన్ నగరాలు మునిగిపోతాయని ఆమె తెలిపారు. రేపు జపాన్ లో ఏర్పడే ప్రళయం 2011లో ఈశాన్య జపాన్ను నాశనం చేసిన సునామీ కంటే భారీగా ఉంటుందని జపాన్ దక్షిణ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అయితే అప్పుడు సంభవించిన భారీ భూకంపం, సునామీని కూడా రియో ముందుగానే ఊహించి హెచ్చరించిందట.
జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహ పరిస్థితుల ప్రకారం ఈ సమయంలో కుజుడు, రాహువు , కేతువుల అశుభ కలయిక ఉంది. అంటే అంగారక యోగం. ఈ అశుభ కలయిక దేశంలో, ప్రపంచంలో అల్లకల్లోలానికి కారణమవుతుంది. కుజుడి అశుభ కలయిక కారణంగా ప్రపంచంలో భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటనం, సునామీ వంటి విపత్తులు సంభవించే అవకాశం ఉంది.
ఇప్పటికే జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్రం మరుగుతున్నదని భారీ బుడగలు ఏర్పడుతున్నాయని తన పుస్తకంలో తెలిపింది. అంతకుముందు కూడా ఆమె బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా చనిపోతారని 1992లో చెప్పారు. ఆమె డైరీలో డయానా డైడ్ అని రాసుకుంది. అచ్చంగా 5 ఏళ్ల తరువాత బ్రిటన్ అందాల యువరాణి డయానా 1997లో ఒక ఘోర కారు ప్రమాదంలో మరణించారు.
అలాగే 1991లో బ్రిటన్ ఫేమస్ సింగర్ ఫ్రెడ్డీ మెర్కురీ చనిపోతారని ఆయన శృంగార వ్యాధి వల్ల మరణం సంభవిస్తుందని ఆమె రాశారు. అది అచ్చు తప్పకుండా జరిగింది. మళ్లీ 1995లో జపాన్ లోని కోబె ప్రాంతంలో భూకంపం వల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుందని ఆమె చెప్పారు. ఇది కూడా నిజమైంది. 1995లో జపాన్ కోబె ప్రాంతంలో భూకంపం వల్ల 6000 మంది చనిపోగా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది.
రియో తాత్‌సూకీ 2025 సంవత్సరంలో జూలై నెలలో మహా ప్రళయం రాబోతున్నట్లు తన డైరీలో రాసుకున్నారు. ఇప్పుడు ఈ రాతలే ఆమెను నమ్మే వారిని కలవరపెడుతున్నాయి. 2025లో అతిపెద్ద సునామీ రాబోతోంది. 2011లో జపాన్ లో భారీ సునామీ వచ్చింది. ఆ సునామీ కారణంగా జపాన్ తో పాటు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, తైవాన్ దేశాల్లో విధ్వంసం జరిగింది. అప్పుడు వచ్చిన సునామీ కంటే 2025 జూలైలో రాబోయే సునామీ మూడు రెట్లు భారీ వినాశనం జరుగుతుందని ఆమె జోస్యం చెప్పారు.
నిజానికి ఆమె చెప్పే సునామీ జపాన్ లో వచ్చినా దాని ప్రభావం ఇండియాపై కూడా ఉంటుంది. 2004 డిసెంబర్ 26న ఇండోనేషియా సమీపంలోని సముద్ర ప్రాంతంలో రేగిన అలజడి, భారీ భూకంపానికి పెద్ద సునామీ వచ్చింది. ఈ కారణంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో సునామీ వచ్చి భయంకరమైన పరిస్థితి ఏర్పాడింది. ఇళ్లు, ఆస్తులు, భవనాలు ధ్వంసమయ్యాయి. గ్రామాలు, పట్టణాలు కొట్టుకుపోయాయి. పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు. వందల సంఖ్యలో సునామీలో కొట్టుకుపోయారు.
సునామీ అంటే కేవలం సముద్రం ఉప్పొంగి పడిపోయే అల కాదు. దాని భారీ వినాశనంతో పాటు, జనాలు ఆశ్రయం కోల్పోతారు. రోగాల బారిన పడతారు. గాయాలు, ఇన్ఫెక్షన్లు, కలుషిత నీటి వ్యాధులు వంటి సమస్యలు పెద్ద ఎత్తున ఉంటాయి. వీటిని పరిష్కరించడానికి భారీ స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు ఉండాలి. సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలా డీల్ చేయాలో ప్రజలకు డ్రిల్స్ చేయిస్తూ ఉండాలి.
ముఖ్యంగా సముద్ర తీరాల్లో నివసించే వారికి ఇది చాలా అవసరం. అలాంటి పరిస్థితి వస్తే ఎలా తప్పించుకోవాలి. ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి. ప్రభుత్వాలు సునామీ పరిస్థితులను ముందుగానే పసిగట్టి డేంజర్ జోన్లలో ప్రజలకు సైరెన్ లాంటివి ఏర్పాట్లు చేయాలి. వైపరీత్యం తరువాత బాధితులకు అందించేందుకు నీరు, ఆహారం, మెడికల్ కిట్లు, తాత్కాలిక వైద్య సేవల కోసం ప్రభుత్వం సంసిద్ధంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ అధికారులు ఈ అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని.. ఇటువంటి వార్తలను నమ్మవద్దు అంటూ చెబుతున్నారు. అయినా సరే టాట్సుకీ అంచనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పర్యాటకులు, జపనీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
జపాన్ వాతావరణ సంస్థ ఈ పెరుగుతున్న ఆందోళనను అధికారికంగా ప్రస్తావించింది. ఈ అంచనాను నమ్మశక్యం కానిది అని పేర్కొంది. భవిష్యత్తులో భూకంపాలు సంభవించే ఖచ్చితమైన తేదీ, సమయం లేదా స్థానాన్ని ప్రస్తుత శాస్త్రీయ పద్ధతి ఏదీ నిర్ణయించలేదని ఆ సంస్థ పునరుద్ఘాటించింది.
అయితే మరోవైపు టాట్సుకి అంచనాలను బలంగా విశ్వసించే పర్యాటకులు జపాన్‌కు వెళ్లేందుకు బయపడుతున్నారు. ఆ దేశానికి వెళ్ళే విమాన బుకింగ్‌లు భారీగా రద్దయ్యాయి. ఎంతగా అంటే జూన్ చివరి, జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్‌కు విమాన రిజర్వేషన్లు 83 శాతం పడిపోవడంతో ఆ దేశ పర్యాటక రంగం కుదేలు అయింది.
దీంతో జపాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే రియో ఆ దేశం గురించి వేసిన అంచనాలతో అక్కడ సునామీ బీభత్సం సృష్టించినా సృష్టించక పోయినా.. ఆమె చెప్పిన భవిష్యత్ ఇప్పుడు ఆ దేశ పర్యాటక రంగంపై మాత్రమే కాదు ఆర్ధిక పరిస్థితిపై కూడా భారీ ప్రభావాన్ని చూపిస్తుంది.
ప్రకృతి తనంతట తానే సహజ సిద్ధంగా నాశనం చేసుకుంటుంది. మళ్ళీ దానికి జీవం పోస్తుంది. ఇది సృష్టి ధర్మం అయితే ప్రకృతి నాశనానికి మనిషి కూడా ఒక ప్రధాన కారణం, అందుకనే అకాల వర్షాలు, భారీ హిమపాతాలు, భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, విపరీతమైన ఎండ వంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి మానవ జీవితాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాయి. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు.
అప్పటికే ప్రపంచంలో జరిగే సంఘటనలు చెప్పిన వ్యక్తులు గుర్తుకొస్తారుఇలాంటి భవిష్యవాణులు, సూచనలు ఎప్పుడూ భయాన్ని మాత్రమే కాదు, ఓ ప్రశ్నను కూడా మన మనస్సుల్లో మిగులుస్తాయి. ముఖ్యంగా ఇవన్నీ నిజం అవుతాయా.? నిజం అయితే ఏం చేయాలి..? అనే వాటి గురించి ఆలోచిస్తుంటారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజంగా భవిష్యాన్ని చెబుతున్నాయా? లేక ఇది మానవ అనుమానాలపై నడుస్తున్న ఊహాగానమా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది.



