తెలంగాణ
Kavitha: జాగృతి జనం బాట ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత

Kavitha: జాగృతి జనం బాటతో తెలంగాణలో సామాజిక న్యాయం సాధిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నుంచి పర్యటన ప్రారంభించే ముందు హైదరాబాద్ గన్‌పార్క్ దగ్గర అమరవీరులకు కవిత నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు దక్కాల్సిన ఫలాలు ఇంకా అందలేదని, జనజాగృతం చేసి సామాజిక తెలంగాణ తీసుకొస్తామని కవిత అన్నారు. 33 జిల్లాలు,119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ఆత్మగౌరవ తెలంగాణను సాధించేందుకు ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగిద్దామని కవిత పిలుపునిచ్చారు.



