జాతియం

Shivraj Patil: కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

Shivraj Patil: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు శివరాజ్ పాటిల్ 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్‌లో తన నివాసంలో చనిపోయారు.

ఏడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ప్రజాసేవ చేసిన శివరాజ్ పాటిల్, 1991-96 మధ్య 10వ లోక్‌సభ స్పీకర్‌గా, 2004-08 వరకు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా ఆయన విశిష్ట సేవలు అందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button