సంక్రాంతి బ్యాటిల్‌లో శర్వానంద్ ఎంట్రీ..!

సంక్రాంతి రేసులో కొత్త సినిమా జాయిన్ అయింది. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతి రేసులో చేరింది. డ్యూయల్ హీరోయిన్లతో ఈ సినిమా రూపొందుతోంది. దీపావళి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇప్పటికే అనేక పెద్ద సినిమాలు సంక్రాంతి 2026కి లైన్‌లో నిలిచాయి. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా ఆ జాబితాలో చేరింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాంబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామజవరగమన తర్వాత రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపావళి సందర్భంగా పోస్టర్ విడుదల చేసి, సంక్రాంతికి రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు.
గతంలో శర్వానంద్ ‘శతమానం భవతి’తో సంక్రాంతి హిట్ అందుకున్నాడు. అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే పెద్ద చిత్రాలతో పోటీ ఉండటంతో రిలీజ్ జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అనే సందేహం ఉంది. షూటింగ్ ఆలస్యాలు ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి రేసులోకి దిగుతోంది. దీంతో ఫ్యాన్స్ ఆసక్తి పెరిగింది.



