ఆంధ్ర ప్రదేశ్
Anitha: తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు.. పక్కా గృహాలు

Anitha: అనకాపల్లి జిల్లా ఎస్ రామవరం మండలంలో హోం మంత్రి అనిత పర్యటించారు. మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన బంగారమ్మపాలెం గ్రామస్తులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు హోం మంత్రి.
ఈ సందర్భంగా పలు సమస్యలపై హోం మంత్రికి ఫిర్యాదు చేయగా వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లకు పక్కా గృహాలు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. సోలార్ ప్యానల్ ద్వారా చేపలు ఎండబెట్టే ప్రక్రియకు త్వరలో శ్రీకారం చూడతామని తెలిపారు.



