India: అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్

India: ఆడి గెలిచిన వాడు కాదు ఓడి గెలిచిన వాడిది నిజమైన గెలుపు. దీని అర్థం, అవకాశం దొరికినప్పుడు గెలిచిన వాడు గొప్పవాడు కాదు, ఓడిపోయి కూడా మళ్ళీ పోరాడి గెలిచిన వాడే నిజమైన విజేత. ఇప్పుడు ఇండియా అదే రుజువు చేసుకుంటుంది. ప్రపంచం ఏమనుకున్నా సరే మన దేశం అడుగు ముందకే వేస్తోంది తప్ప అక్కడే ఆగిపోవడం లేదు. ఏ దేశం ముందు చేయి చాచడం లేదు.
ప్రపంచం మొత్తం భారత్ ఓడిపోవాలని ఏదురుచూస్తున్నా మోదీ సర్కార్ గెలుపు తలుపులను తడుతోంది. అభివృద్ధి దేశంగా మారుతోంది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన పట్టును మరింత పెంచుకోవడానికి కొత్త ప్రణాళికలు వేస్తోంది. ఇంతకీ భారత్ వేసిన ఆ ప్రణాళికలు ఏంటి..? దాన్ని ప్రయోజనం ఏమిటి..?
ప్రపంచం ఏమనుకున్నా సరే మన దేశం ఏదైనా ఒక రంగంలో అడుగు ముందుకు వేసిందంటే. గెలిచి తీరక మానదు. ఎన్ని ఓటములు ఎదురైనా ప్రపంచం మొత్తం మనం ఓడిపోవాలని ఏదురుచూస్తూ గెలుపుతలుపులను తడుతోంది. నిజానికి ఇది సముద్ర వ్యాపార శక్తిని మన గుప్పిట్లోకి తీసుకోవడంలో సాధించిన విజయం. 2047నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఇప్పటికే చాలా మంది నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశంగా మారిన తర్వాత కూడా మనకు అత్యంత అవసరమైన దాని కోసం ఏ దేశం ముందు మన దేశం చేయి చాచడం మన దేశానికి ఇష్టం లేదు.
ప్రపంచ వాణిజ్యంలో అత్యంతధికంగా ఉపమోగించే సముద్ర నౌకల గురించి 2047నాటికి ప్రపంచంలోని టాప్ 5 సముంద్ర శక్తి దేశాల జాబితాలో మన దేశం చేరాలనేది లక్ష్యం. సముంద్ర వాణిజ్యంపై ఒక పెద్ద నియంత్రణనను మనం మన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నాం. కానీ దాని ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తుంది.
ఒకప్పుడు బంగారు పక్షి అని పిలువబడిన మన దేశం శక్తి, సముంద్రపు ఆధిపత్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. 8 సంవత్సరాల తర్వాత తొలిసారిగా మన దేశం ఒక కొత్త నౌకను తన నౌక దలంలో చేర్చుకుంది. ఇది కేవలం LPGని తీసుకోని రావడమే కాదు భారత దేశం ఇక ఎవరిపైన ఆధారపడదని ప్రపంచానికి చూపించింది.
నిజానికి మన దేశ ప్రభుత్వ సంస్థ, షిపింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక కొత్త VLGC అంటే వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్‌ను కొనుగోలు చేసింది. ఈ నౌక పేరు సహ్యాద్రి నౌక ఇది మన దేశపు పశ్చిమ తీరంలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణి పేరు మీద పెట్టబడి ఉంది. దీని పొడవు 225 మీటర్లు. వెడల్పు 36 మీటర్లు. సామర్ధ్యం పరంగా చూస్తే ఇది ఒకేసారి 82వేల క్యూబిక్ మీటర్ల LPGని రవాణా చేయగలదు. అలాగే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నౌక. అంటే ప్రపంచంలోనే రెండొవ అతిపెద్ద నౌక. ఇది కోట్ల మంది భారతీయులకు వంట గ్యాస్ అందించగలదు.
ఇంతకు ముందు LPGని తీసుకురావడానికి మన దేశం విదేశీ నౌకలకు కోట్ల రూపాయలు అద్దేగా ఇచ్చేది. కానీ ఇప్పుడు సొంత VLGC ఉండడం అంటే.. డబ్బు ఆదా, బలం, నియంత్రణ ఉన్నట్లే.. ఎందుకంటే ఇప్పుడు LPG సరఫరా మరింత సురక్షితంగా ఉంటుంది. విదేశీ కంపెనీల మీద ఆధార పడడం తగ్గుతుంది. దీని వల్ల మన దేశ వార్షిక ఆదాయం కూడా 260 కోట్ల వరకు పెరగవచ్చు.
LPG కేవలం వంట గ్యాస్ మాత్రమే కాదు ఇది ఇంధన భద్రతలో ఒక భాగం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో జరినట్లుగా ఒకవేల భవిష్యత్‌లో ఏదైనా సంక్షోభం వస్తే మన దేశానికి సొంత సౌకలు ఉంటాయి. సొంత నియంత్రణ ఉంటుంది. అంటే ఏ శక్తి కూడా మన దేశాన్ని బ్లాక్ మెయిల్ చేయలేదు. ఇదే అసలైన ఆత్మనిర్భర్ భారత్ అంటే. మరింత ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే మనం వంట చేయడానికి ఉపయోగించే LPGలో కేవలం 40 శాతం మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతుంది.
మిగిలిన 60శాతం ఇతర దేశాల దిగుమతుల మీద ఆధారపడుతుంది. ఇందులో ఎక్కువ భాగం. మధ్య ప్రాచ్యం నుంచి దిగుమతి అవుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఏ వస్తువు భద్రత్ర మనకు అత్యంత ముఖ్యమో మన ప్రభుత్వం, షిపింగ్ కార్పొరేషన్ రెండు దానిని సురక్షితం చేయడంపై మొదట దృష్టి పెట్టాయి. ఎందుకంటే.. మన దేశం పేరుకే అభివృద్ధి చెందడం లేదు. అభివృద్ధి చెందిన భారత దేశం యొక్క తేడా స్పష్టంగా కనిపించబోతుంది.
ఏ ఇతర రంగాన్ని చూసినా అన్నింటిలోనూ ప్రధాని మోదీ అడుగులు తెలివైన ఆటగాడిలాగా ఉన్నాయి. అది ఎలక్ట్రానిక్స్ రంగమైన, డిజిటల్, డిఫెన్స్ రంగం అయినా అన్నీ రంగాలలో మన దేశం యొక్క అడుగులు అద్బుతమైనవి. గత కొన్ని రోజుల క్రితం వచ్చిన వార్త ఏమిటంటే మన దేశం యొక్క ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఒకపెద్ద విజయాన్ని సాధించాయి. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 47శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే 99శాతం మొబైల్ ఫోన్లు భారత దేశంలోనే తయారు అవుతున్నాయి.
అలాగే.. ఇటీవల నౌకల తయారీని మన దేశంలో పెంచడానికి 70వేల కోట్ల నిధులను మన భారత ప్రభుత్వం సముద్ర రంగంలో పెట్టుబడి పెడుతుంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన దేశం కొనుగోలు చేసిన ఈ నౌక మన దేశంలో తయారు కాలేదు. ఇది దక్షిణ కొరియాలో తయారు చేయబడింది. ఎందుకంటే నౌకల తయారీలో దక్షిణ కొరియా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం. సాంకేతిక, నాణ్యత, వేగం సాటిలేనిది.
అయితే మన దేశం యొక్క నిజమైన కల ఏమిటంటే భవిషత్యత్‌లో ఇలాంటి VLGCలను మనం మన సొంత షిప్ యార్డ్ లో తయారు చేయడం. మన దేశం ముందుకు వెళ్తున్న వేగాన్ని బట్టి చూస్తే.. సముద్రంలో ప్రయాణించే నౌకల పైనా కూడా మేడిన్ ఇండియా అని రాసి ఉండే రోజు ఎంతో దూరంలో లేదు. దీని కోసం షిపింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 26 భారత నిర్మిత నౌకల కోసం 198.2 బిలియన్ల విలువైన ఆర్డర్ లను ఇవ్వడానికి ప్రణాళిక వేసింది.
ఈ సహ్యాద్రి మొదటి అడుగు మాత్రమే. షిపింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరోక VLGC కోసం కూడా ఆర్డర్ ఇచ్చింది. దాని పేరు సివాలిక్ అది కూడా త్వరలో మన దేశ నౌకాదళంలో చేరబోతుంది. దీనితో పాటు షిపింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంకో రెండు LPGనౌకలను కూడా కొనుగోలు చేసింది. అంటే రాబోయే కాలంలో మన దేశ LPGనౌక దలం ఎంతగా బలపడతుందంటే ఏ ఇందన సూపర్ పవర్ కూడా మనల్ని తక్కువ అంచనా వేయలేదు.
ఒకప్పుడు మనం LPG కోసం విదేశీ నౌకల కోసం ఆధారపడే వాళ్లం. కానీ ఇప్పుడు మన దేశానికి సొంత నౌక ఉంది. ఇది కేవలం ఒక నౌక కాదు ఇది మన దేశం యొక్క ఆత్మనిర్భరతకు ప్రతిక. మన ఇంధన భద్రతకు ఒక డెవలప్. మన సముద్ర శక్తికి ఒక కొత్త జెండా. ఇప్పుడు ఈ నౌక సముద్రంలో ప్రయాణించిన్పపుడు ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద నౌక. 2047లో మన దేశం అభివృద్ది చెందిన దేశంగా మారినప్పుడు మన దేశం ఎవ్వరిపైనా ఆధారపడకుండా తన స్వశక్తితో నిలుస్తుంది అనేది ఈ ప్రయాణం స్పష్టం చేస్తుంది.
ఎందుకంటే ఈ రోజు మనం దక్షిణ కోరియా నుంచి తీసుకున్న ఇలాంటి నౌకను రేపు మనం మన షిప్ యార్డ్ లలో తయారు చేస్తాం. ఇది కేవలం కల కాదు. దీనికి మార్గం ఇప్పటికే సిద్ధమైంది. ఎందుకంటే కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ మన దేశపు మొదటి ఎర్ కాప్టర్ క్యారియర్ INS విక్రాంత్‌ని తయారు చేసిన చోటు. ముంబైలో నుంచి మన అత్యంత శక్తివంతమైన జలాంతర్గామి, యుద్ధనౌకలు తయారు అయ్యాయి.
దీనితో పాటు విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్ యార్డులో మన దేశం జలాంతర్గామిల మరమత్తు, పెద్ద పెద్ద నౌకల తయారీ పనులు చేస్తుంది. అంటే.. భవిష్యత్‌లో VLGCలు, ఆయిల్ ట్యాంకర్లు తయారీ చేయడానికి మన దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. అంటే 2025 నుంచి 2035వరకు ఉన్న దశాబ్ధం మన దేశానికి చాలా కీలకం. ఈ కాలంలో VLGCలు, ఆయిల్ ట్యాంకర్లు మన దేశంలోనే తయారు అవుతాయి.
అంతేకాక గ్రీన్ షిపింగ్స్ టెక్నాలజీ ద్వారా మన దేశం పర్యావరణ అనుకూల నౌకలను ప్రపంచానికి అందిస్తోంది. మన దేశం ఈ విషయంలో తన పనిని బలంగా ముందుకు తీసుకెళ్తున్న తీరును బట్టి చూస్తే ఈ రోజు మనం నౌకలను కొనుగోలు చేస్తున్నాం కానీ రేపు మనం నౌకలను అమ్ముతాం. గతంలో మనం డిఫెన్స్ ఆయుధాలను కొనుగోలు చేసేవాళ్లం కానీ ఇప్పుడు మనం వాటిని అమ్ముతున్నాం..
ఏరోజు అయితే భారతీయ నౌకలు మేడిన్ ఇండియా జెండాతో విదేశీ ఓడ రేవులలో నిలబడతాయే ఆ రోజు మన దేశం యొక్క సముద్ర శక్తిని ప్రపంచం చూస్తుంది. భారత దేశం యొక్క ఈ అడుగు చారిత్రాత్మకమని ఇది భవిషత్య తరాలకు ఇంధన భద్రతకు నిర్దేశం అని తేలుతుంది.



