ఆంధ్ర ప్రదేశ్
టీచర్ నిర్వాకం.. విద్యార్థినులకు అస్వస్థత

తిరుపతి జిల్లా కోట ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులు యూనిఫాం వేసుకోలేదని సుమారు 70 మందిని ఉపాధ్యాయుడు గుంజీలు తీయించారు. దీంతో విద్యార్థులకు కండరాలు పట్టేసి నడవలేని స్థితికి చేరారు. హాస్టల్ వార్డెన్, స్థానిక అధికారులు కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రెలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. పిల్లలను గుంజీలు తీయించిన ఉపాధ్యాయునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఇక విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని గూడూరు డీఎస్పీ హామీ ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



