జాతియం

పాక్ ప్రధానిని పట్టించుకోని నరేంద్ర మోదీ, పుతిన్

యుద్ధంలో గెలవడం అంటే శత్రవును చంపడం కాదు, శత్రువును ఓడించడం. శత్రువును ఓడించడమే యుద్ధం లక్ష్యం. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది భారత్. రక్తం చిందించకుండా, బుల్లెట్ పేల్చకుండా పాక్‌కు ఎలా బుద్ది చెప్పాలనే దానిపై వ్యూహాలు రచిస్తోంది. టూరిస్టులను ఎలా తూటాలు పేల్చి చంపారో అంతకు మించి బాధ అనుభవించేలా ఖతర్నాక్ ప్లాన్ చేస్తుంది.

ఇందుకు నిదర్శనమే చైనాలో పాక్ అద్యక్షుడికి ఎదురైన సంఘటన అక్కడ పాక్‌ ప్రధానికి మోదీ చేసిన అవమానం మరోసారి భారతదేశం పేరు ఎత్తాలన్నా వణికిపోయేలా చేసింది. ఇంతకీ చైనా పర్యటనలో ఉన్న మోదీ అంతలా ఏం చేశాడు..? ఎందుకు ప్రధాని ప్రధాని తల దించుకోవాల్సి వచ్చింది..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. చైనాలోని తియాన్‌జిన్‌ వేదికగా షాంఘై సహకార సంస్థ 25వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌, జిన్‌పింగ్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఆలింగనం చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి.

అయితే ఇక్కడే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కి ఘోర అవమానం జరిగింది. తియాన్‌జిన్‌ వేదికగా జరుగుతున్న షాంఘై సదస్సుల్లో భారత్‌, పాక్‌ ప్రధానులు ఎదురుపడ్డారు. అయితే ప్రధాని మోదీ మాత్రం పాక్‌ ప్రధానిని పట్టించుకోలేదు. పలకరించలేదు.

మోదీ, పుతిన్‌ కలిసి వెళ్తుండగా అక్కడ పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అక్కడే నిల్చున్నప్పటికీ మోదీ ఆయనను పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్లిపోయారు. అయితే పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల తర్వాత మొదటిసారిగా మోదీ, షరీఫ్‌ ఎదురుపడ్డారు.

మరోవైపు ఇదే వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాత్రం ప్రధాని మోదీ ఎంతో ఆత్మీయతతో ఉ‍న్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్‌ను ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకించారు. షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. మరో సందర్భంలో పుతిన్‌ అక్కడి నేతలను పలకరిస్తున్న సమయంలో పాక్‌ ప్రధాని అక్కడున్న వారిని దాటుకొని పుతిన్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

SCO 25వ శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం సంతోషకరమైన విషయమని ప్రధాని మోదీ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయనతో ఉన్న చిత్రాలను సైతం పంచుకున్నారు. ఇక, ఈ సదస్సు అనుబంధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ద్వైపాక్షికంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రష్యా‘ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికా విధిస్తున్న సుంకాలు వంటి విషయాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. షాంఘై శిఖరాగ్ర సదస్సును చైనా అధ్యక్షుడు ప్రారంభించారు.

సమావేశంలో చాలా సందర్భాల్లో మోదీ, పాక్‌ ప్రధానిని పట్టించుకోకుండా దూరంగా ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈనేపథ్యంలో మోదీ పాక్‌ ప్రధానిని పట్టించుకోలేదు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ సీమాంతర ఉగ్రవాద సమస్యను లేవనెత్తినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇరుదేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారేందుకు అవకాశం ఇవ్వకూడదని నేతలు అంగీకరించారని మిస్రీ వెల్లడించారు.

SCO సదస్సు వేదికలో పాకిస్తాన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపం. అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదు అని స్పష్టం చేశారు. ఆ సమయంలో కొన్ని దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలకు మా కృతజ్ఞతలు.

అలాగే కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలను మేం అంగీకరించబోమని వ్యాఖ్యానించారాయన. భద్రత ప్రతి దేశ హక్కు. ఉగ్రవాదం మనమందరికీ సవాల్. ఇది కేవలం భారత్‌కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు. SCO సభ్యదేశాలు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండించాలి. అంతర్జాతీయంగా ఏకతా అవసరమని మోదీ పిలుపునిచ్చారు.

మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ను చైనా చావు దెబ్బ కొట్టింది. టెర్రరిజంపై పోరాటంలో భారత్‌కు ఫుల్ సోపోర్ట్‌ గా ఉంటామని చైనా హామీ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్‌ టైమ్‌లో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన చైనా పాకిస్తాన్‌కు ఫైటర్ జెట్లు, ఆయుధాలు సమకూర్చింది. ట్రంప్‌ – పాకిస్తాన్‌ దోస్తీతో పాక్‌కు చైనా కటీఫ్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు సదస్సు ముగింపు ప్రకటనలో చైనా సహా యూరేషియన్ దేశాలు భారత్ వైపు నిలిచాయి. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఎస్‌సీవో సదస్సులో తీర్మానం చేశాయి.ఆపరేషన్ సింధూర్‌ తర్వాత పరిణామాలు వేగంగా మారాయని చెప్పాలి. ట్రంప్‌ను చచ్చిన పాముగా భారత్, చైనా, రష్యా ట్రీట్ చేస్తున్నాయి. ట్రంప్‌ను లైట్‌ తీసుకున్నాయి బ్రిక్స్ దేశాలు.

మరోవైపు ఈ శిఖరాగ్ర సదస్సులో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. అయితే ఉగ్రవాదంపై స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మోదీ-షరీఫ్ మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంభాషణలు జరగలేదని అధికారులు ధృవీకరించారు.

అలాగే ప్రధాని మోదీ జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనడం ఇరు దేశాల సంబంధాలకు ఒక భీమా పాలసీ వంటిదని అభివర్ణించారు. శాంతియుత వాతావరణం నెలకొంటేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని ఆయన ఉద్ఘాటించారు. ఇది చైనా-భారత్ సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లుగా కనిపిస్తోంది.

అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ పౌరులకు వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసివేసింది. మే 7న ఆపరేషన్ సిందూర్ నిర్వహించి 100 మంది ఉగ్రవాదులను హతం చేయడంతో పాటు పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడం వల్ల భారత్-అమెరికా సంబంధాలు కూడా క్షీణించాయి.

ఈ నేపథ్యంలో భారత్, రష్యా, చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. గతంలో సరిహద్దు ఘర్షణల కారణంగా చైనాతో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ, ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాను సందర్శించడం గమనార్హం.

ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికా విధించిన సుంకాల వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా షాంఘై సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక దౌత్యం, తన వైఖరితో అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాముఖ్యతను చాటిచెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button