ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం

Tirumala: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో కొండపై రద్దీ నెలకొంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు బంగారు రథంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణల మధ్య మాడ వీధుల్లో సాగిన ఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు.

రథంపై విహరిస్తున్న స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ, భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో తిరుమల గిరులు జనసంద్రంగా మారాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button