తెలంగాణ
Hyderabad: అప్పుడే పుట్టిన బిడ్డ.. రోడ్డు పై వదిలేసిన కసాయి తల్లి

Hyderabad: తల్లికి బిడ్డ భారమైంది. తొమ్మిది నెలలు కడుపులో మోసిన తల్లికి ఆ కడుపు తీపి తెలియరాలేదు. క్షణికావేశంలో చేసిన తప్పును సరిదిద్ధుకునే ప్రయత్నంలో మరో తప్పు చేసింది ఆ తల్లి. మానవత్వాన్ని మరిచి కన్నబిడ్డను కర్కశంగా రోడ్డుపై వదిలివెళ్లింది. అల్వాల్ పీఎస్ పరిధిలో మృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
అప్పుడే పుట్టిన పసిబిడ్డను పేపర్లో చుట్టి కాలనీలో ఉన్న గ్రామదేవత గుడిలో విడిచిపెట్టింది ఓ తల్లి. ఉదయాన్నే గమనించిన ఆలయ అర్చకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శిశువును నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.