Brahma Anandam: ఓటీటీలోకి వచ్చేసిన 'బ్రహ్మా ఆనందం'.!

Brahma Anandam: చాలా గ్యాప్ తరువాత బ్రహ్మనందం మళ్లీ ‘బ్రహ్మా ఆనందం’ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగా అలరించింది. బ్రహ్మానందం యాక్టింగ్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎప్పటిలాగే వెన్నెల కిశోర్ కూడా తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన బ్రహ్మ ఆనందం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 19 నుంచి బ్రహ్మా ఆనందం స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీ గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది.
మార్చి 20 నుంచి ఆహా యూజర్స్ అందరికీ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పై రాహుల్ యాదవ్ నక్కా బ్రహ్మా ఆనందం సినిమాను నిర్మించారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి, రఘు బాబు, ప్రభాకర్, దివిజా ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శాండిల్య పిసపాటి సంగీతం అందించారు.