తెలంగాణ
కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగం సస్పెండ్

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసులో పోలీసులపై వేటు పడింది. కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయగా చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



