తెలంగాణ
Talasani: దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చండి.. తలసాని సవాల్

Talasani: చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరు కనుమరుగు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్. సికింద్రాబాద్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
దమ్ముంటే హైదరాబాద్ పేరును మార్చాలని సవాల్ విసిరారు. సికింద్రాబాద్ లేదా లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పోతామాని స్పష్టం చేశారు.



