లారెన్స్ ‘బెంజ్’ సినిమాతో సంచలనం: సంయుక్త మీనన్ హీరోయిన్గా లాక్?

Benz: మల్టీ టాలెంటెడ్ స్టార్ రాఘవ లారెన్స్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బెంజ్’. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాకు బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాలిడ్ ప్రాజెక్ట్‌లో యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ లాక్ అయినట్టు
కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
న బహుముఖ ప్రతిభతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. హీరోగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, డాన్స్ మాస్టర్‌గా ఇప్పటికే ఎన్నో విజయాలు అందుకున్న లారెన్స్ తాజాగా ‘బెంజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో నాలుగో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు.
లోకేష్ కథ అందిస్తుండగా, ఈ సినిమా యాక్షన్, డ్రామాతో ఆకట్టుకోనుందని అంటున్నారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్‌ను తీసుకున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. తెలుగులో ‘భీమ్లా నాయక్’తో ఆకట్టుకున్న సంయుక్త, ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ సినిమాకు సంబంధించి ఆమె ఎంపికపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. ఈ సినిమా లారెన్స్ అభిమానులకు మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని టాక్.