తెలంగాణ
Hyderabad: నిజాంపేట్లో హైడ్రా కూల్చివేతలు

Hyderabad: హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇందిర్మ గృహాలు, బాలాజీనగర్ రోడ్డులో ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు. నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ ఫేస్3 లో రోడ్డుకు అడ్డంగా ఉన్న షెడ్లను ఆకస్మికంగా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుపుతున్నారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అమాయకుల పొట్ట కొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.