సినిమా

Jayasudha: పవన్‌ది మొండిపట్టుదల

Jayasudha: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయసుధ ప్రశంసలు కురిపించారు. పవన్ మొండి పట్టుదలతో రాజకీయాల్లో స్థిరంగా రాణిస్తున్నారని అన్నారు.

సుదీర్ఘ సినీ జీవితంతో పాటు రెండుసార్లు సికిందరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరపున రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. “పవన్ కల్యాణ్‌లో మొండి పట్టుదల ఉంది. సినిమాల్లో ఎలా దూకుడుగా ముందుకు వెళ్లారో, రాజకీయాల్లోనూ అదే దూకుడు చూపిస్తున్నారు. చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి వెళ్లిపోతారు.

కానీ పవన్ అలా కాదు, ఎక్కడా వెనక్కి తగ్గలేదు” అని జయసుధ అన్నారు. రాజకీయ నాయకులు ఒకరిని పొగడటం అరుదైన విషయమే అయినా, బీజేపీ నాయకురాలిగా ఉన్న జయసుధ పవన్‌ను బహిరంగంగా ప్రశంసించడం జనసేన అభిమానుల్లో ఉత్సాహం నింపింది. పవన్‌కు ఇప్పుడు అనుభవం కూడా వస్తోందని, రాబోయే రోజుల్లో ఈ రంగంలో అద్భుతాలు చేస్తారని జయసుధ ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button