జాతియం
ఎర్రకోట పేలుడు కేసులో మరో నలుగురు అరెస్ట్

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరో నలుగురు కీలక నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీనగర్‌లో నలుగురిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు స్కెచ్ వేసినట్లు అధికారులు గుర్తించారు. డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, ఆదిల్ అహ్మద్, షాహీన్ సయీద్ ,ముఫ్తీ ఇర్ఫాన్‌ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రకోట పేలుడు కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అధికారులు అరెస్ట్ చేశారు.



