సినిమా
RGV: డాగ్ లవర్స్.. ఈ వీడియో చూడండి

RGV: సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా వీధి కుక్కల వివాదంపై తీవ్రంగా స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న జంతు ప్రేమికులను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు అత్యంత దారుణంగా చంపేసిన వీడియోను చూడాలంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పుపై గొంతు చించుకుంటున్న శునక ప్రేమికులంతా దయచేసి ఈ వీడియో చూడండి. పట్టపగలు, నగర నడిబొడ్డున నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు ఎలా చంపేశాయో ఇందులో ఉంది అంటూ వర్మ తన పోస్టులో పేర్కొన్నారు. జంతువుల హక్కుల గురించి మాట్లాడేవారు, మనుషుల ప్రాణాలకు విలువివ్వరా అన్న కోణంలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.



