తెలంగాణ
Hyderabad: గోదాంలో చెలరేగిన మంటలు

Hyderabad: హైదరాబాద్ మచ్చబొల్లారంలోని ఓ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. డెకరేషన్‌కు సంబంధించిన గోదాంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. భారీగా చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.