తెలంగాణ
మూసారాం బ్రిడ్జిపై రాకపోకలు బంద్

హైదరాబాద్ మూసారామ్ బాగ్ బ్రిడ్జిపై రాకపోకల్ని బంద్ చేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుండి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. దీంతో అంబర్‌పేటలోని మూసారంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు క్రమంగా పెరుగుతోంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వాహనదారులు గోల్నాక కొత్త బ్రిడ్జి పైనుంచి వెళ్లాలని సూచించారు.



