అంతర్జాతీయం
ఇండోనేషియాలో కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

ఇండోనేషియాలో ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. విద్యార్థులంతా 12 నుంచి 17 యేళ్ల లోపు వారేనని అధికారులు తెలిపారు. భవనం కూలిన సమయంలో స్కూల్‌లో 79 మంది విద్యార్థులు ఉన్నారు. జావాలోని సిడోర్జో పట్టణంలో ఘటన జరిగింది. నాలుగో అంతస్తు నిర్మిస్తున్న క్రమంలో బిల్డింగ్ కుప్పకూలింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



