ఆంధ్ర ప్రదేశ్
గన్నవరంలో అమిత్ షాకు వామపక్షాల నిరసనలు.. గో బ్యాక్ అంటూ నినాదాలు

Amit Shah: కృష్ణా జిల్లా గన్నవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గో బ్యాక్ అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అమిత్ షా అవమానపరిచారంటూ వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.