తెలంగాణ

గ్రూప్-1 విషయంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్

గ్రూప్‌-1 మూల్యాంకనం, ర్యాంకింగ్‌ లిస్ట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌, మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునఃమూల్యాంకనం జరపాలని టీజీపీఎస్సీని ఆదేశించింది.

ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button