ఆంధ్ర ప్రదేశ్

Guntur: గుంటూరులో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Guntur: గుంటూరు నగరంలో కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీ కాలువలు పొంగి రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వంతెనల కిందకు వరద నీరు చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కంకరగుంట ఆర్ యూబీ కింద కూడా వాన నీరు చేరింది. శ్రీనగర్, బొంగరలాబీడు, బ్రాడీపేట్, అరండల్ పేట్, కలెక్టరేట్ కార్యాలయం, ఏటి అగ్రహారం, పట్టాబిపురం సహా ప్రధాన మార్గాల్లో జన జీవనం స్తంభించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button