తెలంగాణ
MMTS ట్రైన్ లైంగిక దాడి కేసులో నిందితుడి గుర్తింపు

MMTS ట్రైన్లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు గౌడవెల్లికి చెందిన మహేష్‌గా పోలీసులు గుర్తించారు. ట్రైన్లో లైంగిక దాడికి యత్నించింది.. మహేష్ అని ఫోటో ఆధారంగా యువతి గుర్తించింది.
ఏడాది క్రితమే మహేష్‌ను అతని భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగా ఉంటున్నారు. మహేష్ గంజాయికి బానిసైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.