సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగచైతన్య దంపతులు

Tirumala: అక్కినేని హీరో నాగచైతన్య తన భార్య శోభితతో కలిసి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి దివ్యదర్శనం పొందిన ఈ దంపతులు భక్తుల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం వీరి దర్శన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



