టాలీవుడ్
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష

Ram Gopal Varma: దర్శకుడు రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మూడు నెలల జైలు శిక్ష విధించింది ముంబై మేజిస్ట్రేట్ కోర్టు. 2018లో ఆయనపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. తాజాగా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
ఆర్జీవీపై మహేష్ చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా కోర్టు విచారణకు ఆదేశించింది. కానీ.. ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు బాధితుడికి రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని సంచలన తీర్పు ఇచ్చింది.