ఆంధ్ర ప్రదేశ్

కడప మేయర్ సురేశ్‌‌ బాబుపై అనర్హత వేటు

కడప మేయర్ సురేశ్‌‌ బాబుపై అనర్హత వేటు పడింది. ఆయనపై పలు వివాదాలు, ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం గతంలోనే షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తాజాగా మేయర్ పదవి నుంచి సురేశ్ బాబును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోకల్ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి మధ్య వివాదం కొనసాగుతోంది. కడప కౌన్సిల్‌లో మేయర్ సీటు పక్కన కుర్చీ వేయకపోవడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య రచ్చ కొనసాగింది. మేయర్ సురేశ్ తనకు గౌరవం ఇవ్వలేదని ఆమె పలుమార్లు మండిపడ్డారు.

కాగా సురేశ్ బాబుపై పలు ఆరోపణలు ఉన్నాయి. కడపలో 50 డివిజన్లు ఉండగా వైసీపీ అధికారం ఉన్న సమయంలో 49 సీట్లు ఆ పార్టీ గెలుచుకుంది. అయితే మేయర్‌గా ఎన్నికయిన సురేశ్ బాబు కడప కార్పోరేషర్ పరిధిలో పలు కాంట్రాక్టులను రీష్టారాజ్యంగా ఇచ్చారని, సొంత కుటుంబ సభ్యులకు సైతం ఇచ్చుకున్నారనే ఆరోపణలు వెల్తువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాజాగా సురేశ్ బాబుపై అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button