తెలంగాణ
Talasani: సనత్‌నగర్ అశోక్ కాలనీలో తలసాని పర్యటన

Talasani: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని అశోక్ కాలనీలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. రోడ్లపై అక్రమంగా వాహనాలు పార్కింగ్, రోడ్డును ఆక్రమించి షెడ్లను నిర్మించారని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే.
అనంతరం కాలనీలోని బస్తీ దవాఖానను ఎమ్మెల్యే పరిశీలించారు. దవాఖానలో అన్ని మందులు ఉన్నాయా ప్రతి రోజు ఎంత మంది వస్తున్నారని ఆస్పత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.



