తెలంగాణ
13న బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ 13, 14 తేదీల్లో ఏపీలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలోని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.



