ఆంధ్ర ప్రదేశ్
Ambati Rambabu: బాలకృష్ణ తాగి జగన్, చిరంజీవిని దూషిస్తే ఏమి చేశారు

Ambati Rambabu: హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా గుంటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బాలకృష్ణపై రాజకీయ విమర్శలు చేస్తే తప్పేముందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. బాలకృష్ణ సాక్షాత్తు అసెంబ్లీలో తాగి జగన్, చిరంజీవి ని దూషిస్తే ఏమి చేశారని నిలదీశారు.
వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే కేసులు నమోదు చేశాం కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును రీ ఓపెన్ చేసి సంబంధం లేని వ్యక్తులపై కేసులు నమోదు చేశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కావాలనే తమపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.



