సినిమా

Kaantha: ‘కాంత’ నుంచి సముద్రఖని పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Kaantha: దుల్కర్ సల్మాన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న స్ట్రెయిట్ తెలుగు చిత్రం ‘కాంతా’ సినీ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ‘లక్కీ భాస్కర్’ బ్లాక్‌బస్టర్ తర్వాత దుల్కర్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1950ల మద్రాసు నేపథ్యంలో ఉత్కంఠభరిత నాటకీయ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘కాంతా’, ప్రేక్షకులను ఆ యుగంలోకి తీసుకెళ్లనుంది. దుల్కర్‌తో పాటు భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సంచలనం రేపగా, తాజాగా సముద్రఖని పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన మోనోక్రోమ్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

సముద్రఖని తీవ్రమైన లుక్‌తో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వేఫారెర్ బ్యానర్స్‌పై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘కాంతా’, సినీ ప్రియులను ఆకట్టుకోవడం ఖాయం. ఈ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button