ఆంధ్ర ప్రదేశ్

ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య

కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియుడు మృతి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వారం రోజుల క్రితం తన ప్రియుడు మృతి చెందడంతో.. సూర్యారావుపేటకు చెందిన తాటికొండ లోహిత తీవ్ర మానసిక వేదనకు గురైంది. దీంతో లోహితను కొద్దిరోజుల పాటు లోహిత వాళ్ల పిన్ని దగ్గరకు పంపించారు తల్లిదండ్రులు.

ఈనేపథ్యంలోనే ఉదయం ఇంట్లో వాళ్లు లేచేసరికి వాళ్ల పిన్ని ఇంట్లో లోహిత ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఘటనపై కంకిపాడు పోలీసులకు సమాచారం అందించిన కుటుంబసభ్యులు.. లోహిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button