సినిమా
మంచు మనోజ్ వీడియో రిలీజ్.. నేను ఎలాంటి తప్పు చేయలేదు

Manchu Manoj: తిరుపతి జిల్లా భాకరాపేట పీఎస్లో అర్ధరాత్రి జరిగిన హైడ్రామాపై మంచు మనోజ్ వీడియో రిలీజ్ చేశాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదన్నాడు మనోజ్. తాను చట్టానికి లోబడే ఉన్నానన్నాడు. పోలీసులు వచ్చి తనపై దురుసుగా ప్రవర్తించారని సైరన్ వేసుకుని రిసార్ట్లో పోలీసులు హంగామా చేశారని వెల్లడించాడు మంచు మనోజ్.
సీఎం పేరు చెప్పి తనను భయపెట్టే ప్రయత్నం చేశారని వాపోయాడు మనోజ్. తన దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయన్నాడు. తాను విద్యార్థులకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని వాళ్లపైన దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏమి చేయట్లేదని వెల్లడించాడు మనోజ్.