‘లెనిన్’ నుంచి క్రేజీ న్యూస్?

Lenin: అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘లెనిన్’ గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ మాస్ ఎంటర్టైనర్లో హీరోయిన్గా భాగ్య శ్రీ బోర్సే ఎంట్రీ ఇస్తోంది. షూటింగ్ త్వరలో మొదలు కానుంది. అఖిల్ ఈసారి బ్లాక్‌బస్టర్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తన కొత్త చిత్రం ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రూపొందిస్తున్న ఈ భారీ చిత్రం అఖిల్ కెరీర్లో కీలకమైనదిగా నిలవనుంది. మొదట హీరోయిన్గా శ్రీలీల ఎంపికైనప్పటికీ, ఆమె తప్పుకోవడంతో భాగ్య శ్రీ బోర్సే ఈ పాత్రలో నటిస్తోంది. జూలై 16 నుంచి షూటింగ్ సెట్స్‌లో ఆమె అడుగుపెట్టనుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.