ఆంధ్ర ప్రదేశ్
కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ

కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఎన్యుమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ చెలరేగింది. దీంతో పిఠాపురం పడా కార్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది. సీఎం ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రశ్నించారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వర్మగా సీన్ మారింది. టీడీపీ, జనసేన నేతల మధ్య తోపులాట జరిగింది.



