ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో మరో భారీ స్కామ్.. పట్టు అంగవస్త్రాల కొనుగోలులో భారీ మోసం

Tirumala: తిరుమలలో మరో భారీ స్కామ్ వెలుగుచూసింది. నకిలీ పట్టు వస్త్రాల కొనుగోలు కుంభకోణం బయటపడింది. పదేళ్లలో 54 కోట్ల మేర అవినీతి జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో టీటీడీ బోర్డు ఏసీబీ దర్యాప్తును కోరింది.
శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు, విరాళాలు ఇచ్చే దాతలు, వేద ఆశీర్వచనం పొందే వారికి సాంప్రదాయబద్ధంగా అందజేసే పట్టువస్త్రాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది. గత పదేళ్లుగా స్వచ్ఛమైన పట్టుకు బదులుగా నకిలీ వస్త్రాలను సరఫరా చేసి టీటీడీ ఖజానాకు గండి కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.



