ఆంధ్ర ప్రదేశ్

మంత్రి కందుల దుర్గేష్‌పై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పర్యావరణ పరిరక్షణపై నిబద్ధతను చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గోదావరి నది కాలుష్యాన్ని పరిశీలించిన ఆయన.. సొంత జనసేన పార్టీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్ మిల్స్ నుంచి రసాయన వ్యర్థాలు నేరుగా గోదావరి నదిలోకి విడుదలవుతున్న దృశ్యాలను చూసి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు కోట్ల మంది భక్తులు వస్తారు.. ఇక్కడికి పుణ్యస్నానాల కోసం వస్తే రోగాలు తెచ్చుకోవాలా?’ అని మండిపడ్డారు. ఘాట్లను అందంగా ముస్తాబు చేయడం కాదు.. నీటిని శుద్ధి చేయడం ముఖ్యం అని స్పష్టం చేశారు. ‘దుర్గేష్ పర్యాటక మంత్రిగా మీరేం చేస్తున్నారు? కూర్చొని మాట్లాడాలి కదా? ఒకవేళ సదరు పరిశ్రమల యాజమాన్యాలు ఏమైనా బ్లాక్‌మెయిల్ చేస్తే నాతో చెప్పండి.. నేను చూసుకుంటా’ అంటూ మంత్రిని, అధికారులను పవన్ కళ్యాణ్ గట్టిగా నిలదీశారు. పర్యావరణం విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button