ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత

Tirumala: తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు అధికారులు. భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలు బాగున్నాయని అన్నారు.
నాణ్యమైన ప్రసాదాలు, భోజనం అందిస్తోందని వసతి సౌకర్యం చాలా మెరుగ్గా ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారని అన్నారు. శ్రీవారి ఆశీస్సులు రాష్ట్రంపై అన్ని వేళలా ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి సవిత తెలిపారు.



