ఆంధ్ర ప్రదేశ్
డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన జోగి రమేష్

Jogi Ramesh: మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ని ఆవిష్కరించారు మాజీ మంత్రి జోగి రమేష్ . నియోజకవర్గ ప్రజలందరూ ఈ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి తమ సమస్యలు తెలియపరచాలని ఆయన కోరారు .
అధికారులవల్లగాని, అధికార పార్టీ నాయకులతోగాని ఇబ్బంది కలిగితే ఈ డిజిటల్ బుక్ లో తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో జగన్ పై, చిరంజీవిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. చిరంజీవిపై బాలయ్య అలా మాట్లాడినా మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.



