తెలంగాణ

SLBC Tunnel: SLBC సొరంగంలో 13వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

SLBC Tunnel: SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 13వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. డీపీఆర్ డేటా ఆధారంగా టన్నెల్‌లో తవ్వకాలు జరుపుతుండ గా నాలుగు చోట్ల తవ్వకాలు పూర్తయినట్లు సమాచారం. మిగతా నాలుగు చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు తవ్వుతున్న చోట నీరు ఉబికివస్తోంది.

దీంతో భారీ మోటర్లతో టన్నెల్ నుంచి నీటి పంపింగ్ చేస్తున్నారు. టన్నెల్‌లో మట్టి, బురద భారీగా పేరుకుపోయింది. అయితే మట్టి, బురదను ఫైర్ జెట్ వాటర్ పంప్స్‌తో తొలగిస్తున్నారు. మినీ పొక్లెయిన్‌తో తవ్వకాలకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button