ఆంధ్ర ప్రదేశ్
Bhuvaneshwari: చిన్నారులతో నారా భువనేశ్వరి దీపావళి వేడుకలు

Bhuvaneshwari: ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చిగురు చిల్డ్రన్స్ హోంలో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. హోంలోని చిన్నారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ఆమె చిన్నారులకు టపాసులు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు నారా భువనేశ్వరి.



