తెలంగాణ
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో రైతుల ధర్నా

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో రైతులు ధర్నా చేపట్టారు. వెల్లుల్ల రోడ్డు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. సరైన రహదారి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యను ఇప్పటికే కలెక్టర్, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్‌లకు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రైతులను చిన్నచూపుగా చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.



