ఆంధ్ర ప్రదేశ్
Vishaka: విశాఖలో రెచ్చిపోయిన కీచకులు.. మైనర్ బాలికపై అత్యాచారం

Vishaka: విశాఖలో కీచకులు రెచ్చిపోయారు. ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టారు. మద్యం మత్తులో పొదల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేఫ్ చేశారు. పోలీస్ కంట్రోల్ రూంకు బాధితురాలి తల్లిదండ్రులు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో నిందితులు అత్యాచారానికి ఒడిగట్టినట్లు గుర్తించారు.



