ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా?

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కలయికలో భారీ సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా చరణ్ కెరీర్లో 16వ సినిమాగా వస్తుండగా ఈ చిత్రంపై ఇప్పటికే సాలిడ్ హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా కూడా ఎదురు చూస్తున్నారు.
RC 16 తర్వాత రామ్ చరణ్ లైనప్ లో సుకుమార్ తప్ప ఇంకో దర్శకుడు పేరు లేదు.కానీ లేటెస్ట్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ కోసం చాలా మంది ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. దీనితో ఈ కలయికలో అతి త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా రావచ్చని టాక్. అలాగే ఈ సినిమాని చరణ్ తో RRR లాంటి సెన్సేషనల్ సినిమా చేసిన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించనున్నట్టుగా టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మరింత సమాచారం రావాల్సి ఉంది.
బుచ్చిబాబుతో చరణ్ RC 16!
RC 17 గా సుకుమార్ తో సినిమా!
ప్రశాంత్ నీల్ తో చరణ్ సినిమా?