క్రీడలు
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నటీమిండియా క్రికెటర్లు

Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను టీమిండియా క్రికెటర్లు జితేష్ శర్మ, రవి బిష్ణోయ్ సహా మరో 9 మంది క్రికెటర్లు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న క్రికెటర్లకు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు క్రికెటర్లను స్వామిఅమ్మవార్ల శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని వారికి అందజేశారు.



