క్రీడలు
భారత మహిళా క్రికెట్ టీమ్‌కు ప్రధాని ఆతిథ్యం

PM Modi: వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సత్కారం అందించారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో జట్టు సభ్యులను ఆహ్వానించిన మోదీ, వారి అద్భుత ప్రదర్శనను ప్రశంసించారు. వరుస ఓటముల తర్వాత అసాధారణ పునరాగమనం చేసి దేశానికి గౌరవం తెచ్చినందుకు మహిళా జట్టును అభినందించారు.
ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు జట్టు సభ్యులు ప్రపంచ కప్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ‘నమో’ అని సంతకం చేసిన జెర్సీని ప్రధానికి బహుమతిగా అందించారు. 2017లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు అప్పట్లో మోదీని కలిసిన విషయాన్ని ప్రధాని స్మరించుకున్నారు. ఇప్పుడు కప్‌తో తిరిగి రావడం దేశానికి గర్వకారణమని ఆయన తెలిపారు.



