సినిమా

Manasantha Nuvve: ‘మనసంతా నువ్వే’ రీ-రిలీజ్!

Manasantha Nuvve: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన కల్ట్ లవ్ స్టోరీ ‘మనసంతా నువ్వే’ మళ్లీ వెండి తెరపైకి రాబోతోంది. 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు 4కె, డాల్బీ అట్మాస్‌లో రీమాస్టర్ అయింది. 2026 ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ సినిమా రీ-రిలీజ్ కానుంది.

2001లో విడుదలై అప్పటి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ‘మనసంతా నువ్వే’ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వి ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఆర్పీ పట్నాయక్ అందించిన చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది.

ఈ సినిమాని ఇప్పుడు 4కె రిమాస్టర్డ్ వర్షన్‌లో, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్‌తో అప్‌గ్రేడ్ చేశారు. వచ్చే సంవత్సరం వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న మళ్లీ థియేటర్లలో ప్రదర్శింపబోతున్నట్లు నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మళ్లీ వెండి తెరపై ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button